మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shiva Mangala Ashtakam – శ్రీ శివ మంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ || 1 ||
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ || 2 ||
భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ || 3 ||
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ || 4 ||
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్ర్యంబకాయ సుశాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ || 5 ||
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ || 6 ||
సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళమ్ || 7 ||
సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ || 8 ||
శ్రీచాముండాప్రేరితేన రచితం మంగళాస్పదమ్ |
తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ || 9 ||
ఇతి శ్రీ శివమంగళాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.